- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. న్యాయం కోరుతూ రోడ్డెక్కిన బాధితులు
విద్యుత్ మరమ్మత్తులు చేస్తుండగా హై టెన్షన్ విద్యుత్ షాక్‌కు గురై మరణించగా.. ఆర్థికంగా ఆదుకోవాలంటూ బాధితులు కోరుతున్నారు.

దిశ, రేవల్లి: మండల కేంద్రం రేవల్లికి చెందిన కాళ్ల లక్ష్మయ్య (38) సోమవారం ఉదయం విద్యుత్ మరమ్మత్తులు చేస్తుండగా హై టెన్షన్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఓ నిరుపేద కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడని.. ఆరోపిస్తూ మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు సబ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం.. మృతుడు లక్ష్మయ్య జీవనోపాధి కోసం వ్యవసాయ పనులతో పాటు గ్రామంలో అన్ని రకాల విద్యుత్ మరమ్మత్తు పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గ్రామంలో విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడల్లా స్థానిక విద్యుత్ అధికారుల వెంబడి ఉంటూ మరమ్మత్తు పనుల్లో సహకరిస్తూ ఉండేవాడు. సోమవారం ఉదయం రేవల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో విరిగిపోయిన విద్యుత్ స్తంభానికి కూడా మరమ్మత్తులు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో విద్యుత్ మరమ్మత్తు పనులు చేస్తుండగా హైటెన్షన్ విద్యుత్ షాక్‌కు గురవడంతో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆర్థిక పరిహారం ఇవ్వాలని కోరుతూ..
పనులు చేపట్టే ముందు విద్యుత్ సరఫరాను నిలిపివేసి "లైన్ క్లియర్" ఇవ్వాలని స్థానిక సబ్ స్టేషన్ విద్యుత్ సిబ్బందిని పలుమార్లు కోరినా వారు స్పందించలేదని, అదే నిర్లక్ష్యం లక్ష్మయ్య ప్రాణాలను బలిగొన్నదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఒక కుటుంబానికి అండగా నిలిచిన చేయి... అధికారుల నిర్లక్ష్యానికి బలైపోయింది. గ్రామం కోసం పనిచేసిన వ్యక్తి ప్రాణం కోల్పోవడం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోందని, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఒక్కసారిగా దూరం కావడంతో భార్య, పిల్లలు రోడ్డు పాలైనారని. లక్ష్మయ్య మరణానికి బాధ్యులెవరో గుర్తించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోని ఆర్థిక పరిహారం ఇవ్వాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. స్థానిక ఎస్సై రజిత గోపాల్పేట ఎస్సై డి. శశిధర్ లు పరిస్థితిని సమీక్షించి బాధిత కుటుంబ సభ్యులు మరియు విద్యుత్ అధికారులతో చర్చించి బాధితునికి తగు న్యాయం జరిగేలా హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ఆందోళనను విరమించారు.






