ఆధునిక వ్యవసాయంపై అవగాహన అవసరం

by Naveena |   (  Updated:2025-03-10 10:06:41  IST  )

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

ఆధునిక వ్యవసాయంపై అవగాహన అవసరం
X

దిశ, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. అలాగే శాస్త్రవేత్తల సమక్షంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కిసాన్ మేళా కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ యాసంగి వేరుశనగ,వరి,మొక్కజొన్న పంటలపై అవగాహన కార్యక్రమాలు, వివిధ వ్యవసాయ అంశాలపై నమూనాల ప్రదర్శనలు, ఆధునిక వ్యవసాయ యంత్రాల డెమో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అదనంగా అధిక సాంద్రత పత్తి సాగుపై రైతులు,శాస్త్రవేత్తలతో వివరణాత్మక చర్చ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి రైతులకు సూచించారు. వివిధ కంపెనీల స్టాల్స్‌ను సందర్శించారు.

కిసాన్ మేళా కార్యక్రమాలు రైతులకు ఆధునిక సాంకేతికత పరిచయం కల్పించి, వ్యవసాయ రంగంలో నూతన మార్పులు తీసుకురావటానికి ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టీ. ప్రభాకర్ రెడ్డి , ఇతర శాస్త్రవేత్తలు, పలు రకాల విత్తన కంపెనీల ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నజీర్, వాలియనాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మిద్దె రాములు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ వెంకటస్వామి, రాగి మధుసూదన్ రెడ్డి ,డాక్టర్ ఆర్ఎంపి తిరుపతయ్య, గోవింద నాయక్ ,గంగనమోని తిరుపతయ్య, కారుకొండ నరేందర్ రెడ్డి తో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story