- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం ఎదుట లొంగిపోయిన నక్సల్స్.. ఉమ్మడి జిల్లా వారు ఇద్దరు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం లొంగిపోయిన నక్సల్స్ లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు. ఒకరు నారాయణపేట జిల్లా జక్లేరు గ్రామానికి చెందిన ఉమితి అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్,

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం లొంగిపోయిన నక్సల్స్ లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు. ఒకరు నారాయణపేట జిల్లా జక్లేరు గ్రామానికి చెందిన ఉమితి అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్, మరొకరు జోగులాంబ గద్వాల జిల్లా కాసేపోగు భవాని అలియాస్ సుగుణ లొంగిపోయారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన వెంకట్ రాములు, శంకరమ్మ దంపతుల ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తె సంతానంలో చిన్న కుమారుడు అనిల్ కుమార్. తండ్రి చిన్న వయసులో మృతి చెందగా.. మహబూబ్ నగర్ హాస్టల్ లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తూ వచ్చాడు. హై స్కూల్ పుట్టినరోజులో నక్సల్స్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై వెళ్లిపోయాడు. లొంగిపోవడానికి కొద్ది రోజుల ముందు వరకు అనిల్ కుమార్ నక్సల్ అగ్ర నేతలలో ఒకడిగా వెలుగుందిన దేవుజి వద్ద కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తూ వచ్చాడు. రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో తల్లి శంకరమ్మ మరణించింది. దేవుజీ వద్దనే గార్డు గా పని చేసిన కాశి పోగు భవాని అలియాస్ సుగుణ సొంత ఊరు జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కుడితీ రావుల చెరువు. కాశి పోగు ప్రకాశం, దేవకమ్మ నలుగురు సంతానంలో రెండవ కూతురు. గద్వాలలో ఇంటర్ చదువుకునే సమయంలో పదేళ్ల క్రితం నక్సల్స్ బాట పట్టింది. వెళ్లినప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె ఒక్కసారి కూడా సొంత ఊరికి వచ్చిన దాఖలాలు లేవు అని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మరి కొంతమంది నక్సల్స్ తో కలిసి రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందినవారు ఇద్దరు ఉండడం విశేషం. లొంగిపోయిన వారికి ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల రివార్డును అందజేశారు.






