మార్ల‌పాడు తండాలో నాటు సారా త‌యారీ..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మార్లపాడు తండా గ్రామంలో గత మూడు రోజుల నుండి ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ పై సర్వే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం

మార్ల‌పాడు తండాలో నాటు సారా త‌యారీ..!
X

దిశ, అచ్చంపేట : ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షానికి నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట మండ‌ల ప‌రిధిలోని మార్ల‌పాడు తండా ముంపున‌కు గురైన విష‌యం తెలిసిందే. మార్ల‌పాడు తండాను సీఎం రేవంత్ రెడ్డి సంద‌ర్శించారు. అయితే గత మూడు రోజుల నుంచి ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ పై సర్వే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మార్ల‌పాడు తండాలో సర్వే నిర్వ‌హిస్తుండ‌గా.. కొంత గిరిజనులు నాటు సారా తయారు చేస్తున్న విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా అచ్చంపేట తహసీల్దార్ సైదులు నాటు సారా తయారు చేస్తున్న గిరిజనులను ఘాటుగా హెచ్చరించారు. తయారు చేస్తున్న సారా భట్టిలు, ముడి సరుకును మొత్తం పూర్తిగా ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని, మరోసారి అలా చేస్తే సహించేది లేదని, ప్రొహిబిషన్ సెక్షన్ల ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తయారిదారుల‌ను హెచ్చరించారు.

Next Story