- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
సీఐటీయూ వనపర్తి జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాలు ( సీఐటీయూ-టీయూసీఐ-ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

దిశ, వనపర్తి టౌన్ : సీఐటీయూ వనపర్తి జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాలు ( సీఐటీయూ-టీయూసీఐ-ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి మండ్ల రాజు, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు పి అరుణ్ కుమార్ ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మోష మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయినా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కార్పొరేటు శక్తుల లాభాలు చేకూర్చడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది అన్నారు. కార్మిక వర్గంపై, రైతాంగంపై గ్రామీణ వ్యవసాయ కార్మికులపై భారాలు వేస్తున్నది. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకోవచ్చింది. దేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వారితో కొట్లాడి సాధించుకున్న చట్టాలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తున్నది. చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చేందుకు ఈ లేబర్ కోడ్ లు తీసుకువచ్చింది అన్నారు. 8 గంటల పని దినాన్ని 12 గంటల పని దినంగా మార్చాలని చూస్తుంది. వేతనాలు నిర్ణయించే పద్ధతిని చర్చల ద్వారా కాకుండా ఏకపక్షంగా నిర్ణయించే పద్ధతిని తీసుకువచ్చింది. యూనియన్లలో గుర్తించే విషయంలో అనేక మార్పులు తెచ్చింది. ఆయా పరిశ్రమల్లో అడ్వైజరీ బోర్డు తెస్తామని కోడ్ లో పొందుపరిచింది.
సామాజిక భద్రతపై దాడి చేస్తుంది. పిఎఫ్, ఈఎస్ఐ చట్టాల్లో అనేక మార్పులు చేసి యజమానుల దయ దక్షిణాలపై కార్మికులు ఆధారపడేలా చేస్తుంది. మహిళలను ప్రమాదకరమైన పనులలో రాత్రి వేళల్లో పని చేయించవద్దని గత చట్టాల్లో ఉన్నప్పటికీ.. నేడు వాటిని రద్దుచేసి, మిషన్లతో సమానంగా రాత్రింబవలు పని చేయాలనే పద్ధతిని తీసుకువచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రైవేటు సంస్థలకు అప్ప చెప్పేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. కార్పొరేట్ కంపెనీ ల కోసం భూములలో లాక్కోవడానికి తెచ్చిన మూడు నల్ల చట్టాలను రైతులు పోరాటం వల్ల ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చినప్పటికీ.. ఇతర రూపాలలో రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తుంది. విత్తన చట్టం 2025 ముసాయిదా, విద్యుత్తు సవరణ బిల్లు, విబిజి రాంజీ చట్టం, ఇతర చట్టాలలో ముందుకు తెచ్చింది. ఇప్పటికి వ్యవసాయరంగం సంక్షోభంలోనే ఉంది, దీని ఫలితంగా జీవనోపాధి కోసం నగరాలకు వలసలు పెరుగుతున్నాయని తెలిపారు. నేడు జాతీయ వ్యవసాయం మార్కెట్ ముసాయిదా పత్రం ద్వారా రద్దయినా..చట్టాలలోని అంశాలను ముందుకు తెస్తూ, రైతాంగం పై దాడి చేస్తున్నది. స్వదేశీ,విదేశీ, బడా కార్పొరేట్ సంస్థలకు కట్టపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ విధానాల ఫలితంగా ఏటా పదివేల మంది రైతులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వాటి సవరణకు కనీసం మద్దతు ధర చట్టం తేవాలని, అనేక సార్లు విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్పొరేటర్ శక్తులకు, లక్షల కోట్ల రూపాయలు వివిధ ట్యాక్సీ ల పేరుతో రద్దు చేస్తున్నది. ప్రభుత్వం రైతాంగానికి మాత్రం రుణమాఫీ చేయడానికి చేతులు రావడం లేదు. అందుకే ఈ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమ్మెలో కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ,టియుసిఐ జిల్లా కార్యదర్శి గణేష్, సిఐటియు నాయకులు మధు పాల్గొన్నారు.






