- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాబోయే రోజుల్లో నారాయణపేట దశా దిశా మారుద్దాం : ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి
దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట నియోజకవర్గానికి 2023 నుంచి మంచి రోజులు వచ్చాయని... రాబోయే రోజుల్లో నారాయణపేట దశా దిశను మారుద్దామని

దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట నియోజకవర్గానికి 2023 నుంచి మంచి రోజులు వచ్చాయని... రాబోయే రోజుల్లో నారాయణపేట దశా దిశను మారుద్దామని ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి పేర్కొన్నారు. నారాయణపేట కొండారెడ్డిపల్లి చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మళ్లీ ఆశీర్వదిస్తే నారాయణపేట ఎమ్మెల్యేగా గెలుపొంది నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్లను పూర్తి చేసి ముదిరాజుల, మత్స్య సంపద అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక కృషితో సుమారు రూ.122 కోట్ల బడ్జెట్ తో చెరువులో చేప పిల్లలను పెంచే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఒక్కో టిఎంసి కెపాసిటీ గల రెండు పెద్ద రిజర్వాయర్లు ఏర్పాటు జరిగితే చేపల సంపద పెరుగుతుందన్నారు. కృష్ణా- వికారాబాద్ రైల్వే లైన్ ఏర్పాటుతో నారాయణపేట కు మరో మణిహారంగా చెప్పవచ్చు అన్నారు. ముదిరాజుల సంక్షేమం కోసం తన వంతు తోడ్పాటును అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సదాశివరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి రెహమాన్ పాల్గొన్నారు.






