- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లమల్లలో మారు మ్రోగిన శివ నామస్మరణం
నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల లోతట్టు ప్రాంతంలో ఉన్న శివాలయాలు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సందర్భంగా భక్తులతో శివాలయాలలో సందడి ఏర్పడి శివనామ స్వరంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

X
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల లోతట్టు ప్రాంతంలో ఉన్న శివాలయాలు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సందర్భంగా భక్తులతో శివాలయాలలో సందడి ఏర్పడి శివనామ స్వరంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రధానంగా నల్లమల్ల ప్రాంతంలో కొలువుదీరిన ఉమామహేశ్వర క్షేత్రం, అంతర్ గంగా, మన్ననూర్ తదితర శివ క్షేత్రాల వద్ద భక్తులు వందల సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఆలయాల వద్ద అన్నదానం చేస్తున్నారు. ఉమామహేశ్వర క్షేత్రంలో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉండడం వలన భారీ కేట్స్ ఏర్పాటు చేసి స్వామి వారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించారు. పోలీసులు సైతం ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని భక్తులకు సూచనలు చేస్తున్నారు.
Next Story






