- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లమల్ల క్రీడా ఆణిముత్యం ఉప్పల పహాడ్ గ్రామవాసి
మండల పరిధిలోని ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు ఆర్కపల్లి నిరంజన్, శారద వారు కూలి పని చేసే అతి పేద కుటుంబం పనిచే సుకుంటేనే తప్ప పూట గడవని పరిస్థితి వారిది.

దిశ, వంగూర్ : మండల పరిధిలోని ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు ఆర్కపల్లి నిరంజన్, శారద వారు కూలి పని చేసే అతి పేద కుటుంబం పనిచే సుకుంటేనే తప్ప పూట గడవని పరిస్థితి వారిది. వారి రెండో కూతురు స్రవంతి మహబూబ్ నగర్ జిల్లాలో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో (MSDS) మొదటి సంవత్సరం చదువుకుంటూ ఉంది. ఈనెల 7, 8వ తేదీలలో తిరుపతిలో జరిగిన సౌత్ జోన్ జాతీయ స్థాయి జూనియర్ బాలికల షూటింగ్ బాల్ క్రీడల్లో తెలంగాణ జట్టు తరపున పాల్గొని, తెలంగాణ జట్టు 3వ స్థానం పొందుటకు అసమాన క్రీడా నైపుణ్యతను ప్రదర్శించి ట్రోఫీ మెరిట్ సర్టిఫికెట్, కాంస్య పథకం సాధించడం వల్ల ఈనెల 18న మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి అభినందించి సన్మానించారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోచ్ గోపాలం తెలిపారు. 2025 నవంబర్ 7 నుంచి 9 వరకు ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ లో జరిగిన సబ్ జూనియర్ బాలికల జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొని, వెండి పతకము, మెరిట్ సర్టిఫికెట్ సాధించిందని అన్నారు. డిసెంబర్ 14న వికారాబాద్ జిల్లా, తాండూర్ పట్టణంలో జరిగిన అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ షూటింగ్ బాల్ క్రీడల్లో పాల్గొని, క్రీడా ప్రతిభను చాటి జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైందని తెలిపారు. అలాగే ఏప్రిల్ చివరివారంలో ఢిల్లీలో జరుగు జాతీయస్థాయి క్రీడల్లో ఆల్ ఇండియా షూటింగ్ బాల్ ఫెడరేషన్ కప్పులో కూడా పాల్గొంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ మా తల్లిదండ్రులు పడుతున్న కష్టం, శ్రమ వృధా కాకుండా, నేను కష్టపడి చదివి, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించాలని నా ప్రథమ కర్తవమని, నాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న కోచ్ గోపాలం కు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. నేను ఉద్యోగం సాధించి వారికి అంకితం చేస్తానని సంతోషాన్ని వ్యక్తపరిచారు. అనంతరం జాతీయ క్రీడలలో ప్రతిభ కనపరిచిన స్రవంతిని గ్రామ సర్పంచ్ ఖలీల్ గ్రామ పెద్దలు, ప్రజలు అభినందించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అడమ్స్, పుష్ప, రవి, ఫిజికల్ డైరెక్టర్ రజిని, తల్లిదండ్రులు నిరంజన్,శారద, శ్రావణి పాల్గొన్నారు.






