- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5 గంటలుగా ధర్నా..రంగంలోకి నాగర్ కర్నూల్ డీఎస్పీ
కుమ్మరజాతరలో మృతి చెందిన చిన్నారి మరణానికి కారణమైన నిందితులను శిక్షిస్తామని నాగర్ కర్నూల్ డీఎస్పీ హామీ ఇచ్చారు.

*5 గంటలుగా కొనసాగుతున్న ధర్నా*
*రంగంలోకి దిగిన నాగర్ కర్నూల్ డీఎస్పీ*
*నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ*
దిశ, వెబ్ డెస్క్: కుమ్మెర మల్లన్న స్వామి జాతర నేపథ్యంలో మరణించిన చిన్నారి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చిన్నారి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షిస్తామని నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఈ హామీ ఇవ్వడంతో రాత్రి 11:30 కు విశారదన్ మహరాజ్ సభ్యులు ధర్నా విరమించారు. సుమారు 5 గంటల పాటు ఈ ధర్నా కొనసాగగా, కాసేపటి క్రితమే విరమించారు. కాగా కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో కాంగ్రెస్ సర్పంచ్, అగ్రనాయకుల దాడిలో రెండు నెలల చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో చిన్నారి మృతదేహంతో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు చాకలి చంద్రకళ కుటుంబ సభ్యులు, పలుగురు నేతలు నిరసన తెలిపారు.






