కాంగ్రెస్ పార్టీకి నాగం రాజీనామా

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ పార్టీకి నాగం రాజీనామా
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: రాష్ట్ర మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపారు. గత కొన్ని సంవత్సరాలుగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ప్రధాన భూమిక పోషించిన నాగం కు కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించలేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి కి టికెట్ ఇవ్వడంతో నాగం నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యి చివరి వరకు టికెట్ కోసం ప్రయత్నించారు.

ఢిల్లీ వెళ్లి అధిష్టానంతోను మాట్లాడారు . తన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తన అనుచర వర్గం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దిశ కు తెలిపారు. కాగా ఆయన బీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం సాయంత్రం నాగం ను కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఒకటి రెండు రోజులలో నాగం బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ ఎస్ లో చేరగా ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి సైతం బీఆర్ఎస్ లో చేరుతుండడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.



Next Story