రేవల్లి నూతన త‌హ‌శీల్దార్ గా ఎన్.స‌ర‌స్వ‌తి నియామ‌కం

by Ratna Kumari |

మండ‌ల నూత‌న త‌హ‌శీల్దార్ గా ఎన్. స‌ర‌స్వ‌తి నియ‌మితుల‌య్యారు. ఇక్క‌డ ప‌ని చేసిన కేతావ‌త్ ల‌క్ష్మీదేవి వ‌న‌ప‌ర్తి జిల్లా క‌లెక్ట‌ర్ కలెక్ట‌ర్ కార్యాల‌యానికి బ‌దిలీపై వెళ్లారు.

రేవల్లి నూతన త‌హ‌శీల్దార్ గా ఎన్.స‌ర‌స్వ‌తి నియామ‌కం
X

దిశ‌, రేవ‌ల్లి : మండ‌ల నూత‌న త‌హ‌శీల్దార్ గా ఎన్. స‌ర‌స్వ‌తి నియ‌మితుల‌య్యారు. ఇక్క‌డ ప‌ని చేసిన కేతావ‌త్ ల‌క్ష్మీదేవి వ‌న‌ప‌ర్తి జిల్లా క‌లెక్ట‌ర్ కలెక్ట‌ర్ కార్యాల‌యానికి బ‌దిలీపై వెళ్లారు. దీంతో నూత‌న త‌హ‌శీల్దార్ శ‌నివారం రేవ‌ల్లి త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో ఉద్యోగ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌ల‌ను పార‌ద‌ర్శ‌కంగా వేగవంతంగా అందించే దిశ‌గా కృషి చేస్తానని రెవెన్యూ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించి.. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయ‌డం త‌న ప్ర‌ధాన ల‌క్ష్యం అని తెలిపారు. కార్యాల‌య సిబ్బంది నూత‌న త‌హ‌శీల్దార్ ను అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్ఐ ప‌వ‌న్, జూనియ‌ర్ అసిస్టెంట్ రాజేష్, భ‌ర‌త్, జీపీవోలు వ‌సంత‌, సువ‌ర్ణ‌, కృష్ణ‌య్య‌, ఆప‌రేట‌ర్ శ్రీనివాస్ నాయ‌క్ పాల్గొన్నారు.

Next Story