- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యాటక, చారిత్రక, పరిశోధన కేంద్రంగా ముడ్ మల్ నిలువు రాళ్లు
నిలువు రాళ్ల ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక పేర్కొన్నారు.

దిశ, మక్తల్ : ఆదిమానవుడు నివసించిన ప్రాంతానికి ముడుమల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం భారత దేశంలో తెలంగాణకు నియోజకవర్గం ముడుమల్ గ్రామానికి గర్వకార ణమని నారాయణపేట కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్ నిలువు రాళ్లను ఆమె సందర్శించారు. నిలువు రాళ్లు, సప్తర్షి మండలంతో ఖగోళ పరిజ్ఞానాన్ని, కాలాలను, వాతావరణ మార్పులను ఆనాడే తెలుసుకునే వారని, కాలాలను గుర్తించడానికి ఆది మానవులు నిలువురాళ్లను ఓ క్రమంలో ఏర్పాటు చేసినట్టు ఆర్కియాలజీ శాఖకు చెందిన అధికారులు కలెక్టర్ కు వివరించారు.
ఎలాంటి సాంకేతికత లేని 4 వేల సంవత్సరాల క్రితమే రాళ్ల ద్వారా తెలుసుకోవడం అనేది అబ్బురపరిచేలా, అద్భుతంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణలో భాగంగా ఈ నెల 18 నుంచి 23 వరకు యువజన క్రీడా/పర్యాటక వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని ఆమె సూచించారు. రాష్ట్ర పర్యాటక శాఖకు సంబంధించిన వారోత్సవాల టూరిస్ట్ గైడ్ పోస్టర్ తో ముడ్ మల్ నిలువు రాళ్ళ విశిష్టత ను తెలిపే ప్రచార పత్రాలను కలెక్టర్ ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ రషీద్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వెంకటేశ్ శెట్టి పాల్గొన్నారు.






