యాదగిరిగుట్ట దేవస్థానం చైర్మన్‌గా ఎంఎస్‌ఎన్ రెడ్డి..

by Kodari Anjali |

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్‌గా పాలమూరు బిడ్డ మన్నే సత్యనారాయణ రెడ్డికి అవకాశం లభించింది.

యాదగిరిగుట్ట దేవస్థానం చైర్మన్‌గా ఎంఎస్‌ఎన్ రెడ్డి..
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్‌గా పాలమూరు బిడ్డ మన్నే సత్యనారాయణ రెడ్డికి అవకాశం లభించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నవాబుపేట మండలం గురుకుంట గ్రామములో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సత్యనారాయణ రెడ్డి ఉన్నత చదువులు చదివి ఫార్మా కంపెనీ ఎంఎస్‌ఎన్ ల్యాబ్‌ను స్థాపించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. మరోవైపు శాస్త్రీయ పరిశోధనలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అత్యున్నత శిఖరాలకు చేరుకొని తాను పుట్టిన పాలమూరు గడ్డకు ఖ్యాతిని తీసుకువచ్చారు. పాలమూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన ఎంఎస్ఎన్ రెడ్డి వివిధ సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందిన ఎంఎస్‌ఎన్ రెడ్డి నిరాడంబరుడుగా.. సేవ తత్పరుడిగా పేరుగాంచడం వల్లే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కరుణ కటాక్షాలతో చైర్మన్ గా విధులు నిర్వహించే అవకాశం లభించింది అని ఎం ఎస్ ఎన్ రెడ్డి అభిమానులు అంటున్నారు.

Next Story