- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యాంగంపై బూటు విసిరినట్టే : ఎంపీ మల్లు రవి
by Ratna Kumari |
దిశ, కందనూల్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై న్యాయవాది బూటు విసిరిన చర్యను నాగర్ కర్నూల్ ఎంపి డాక్టర్ మల్లు రవి సోమవారం ఒక

X
దిశ, కందనూల్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై న్యాయవాది బూటు విసిరిన చర్యను నాగర్ కర్నూల్ ఎంపి డాక్టర్ మల్లు రవి సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇది రాజ్యాంగం తలపై, రాజ్యాంగంపైనే బూటు వేయడంలాంటిదని ఘాటుగా స్పందించారు. భారతదేశంలో 75 సంవత్సరాల రాజ్యాంగ పాలనలో గవాయి షెడ్యూల్డ్ కేటగిరీ నుంచి రెండవ సారి పూర్తిగా తన స్వంత అర్హతతోనే భారతదేశానికి భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయ్యారని తెలిపారు. దీనిని భారతదేశంలోని మొత్తం షెడ్యూల్డ్ కులాలపై దాడిగా చూడాలన్నారు. ఇది భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరీరంపై జరిగిన ట్రోమా కాదు.. భారతదేశ గుండె పై జరిగిన గొప్ప ట్రోమా అని వ్యాఖ్యానించారు. ఈ సంఘటన మూలాన్ని తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం దోషిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించాలన్నారు. రాజ్యాంగాన్ని విశ్వసించే అన్ని రాజకీయ పార్టీలు ఈ సంఘటనను ఎదుర్కోవడానికి ఐక్యంగా పోరాడాలన్నారు.
Next Story






