త‌ల్లి, కూతురు, కుమారుడు మిస్సింగ్

by Ratna Kumari |

త‌ల్లి, కూతురు, కుమారుడు అదృశ్య‌మైన సంఘ‌ట‌న గోపాల్ పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

త‌ల్లి, కూతురు, కుమారుడు మిస్సింగ్
X

దిశ‌, గోపాల్ పేట : త‌ల్లి, కూతురు, కుమారుడు అదృశ్య‌మైన సంఘ‌ట‌న గోపాల్ పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గోపాల్ పేట‌కు చెందిన ఈశ్వ‌ర‌మ్మ కూతురు నీలం యాద‌మ్మ‌(30), ఫిబ్ర‌వ‌రి 07న ఇంటి నుంచి బ‌య‌లుదేరి వెళ్లింది. ఆమెతో పాటు కూతురు, కుమారుడు కూడా క‌నిపించ‌కుండా పోయారు. నీల‌మ్మ‌కు పెద్ద కొత్త‌ప‌ల్లికి చెందిన రామ‌కృష్ణ‌తో ఆరేళ్ల క్రితం పెళ్లి జ‌రిగింది. ఒక పాప‌, బాబు క‌ల‌రు. అయితే 20 రోజుల కింద‌ట బోనాల పండుగ సంద‌ర్భంగా గోపాల్ పేట‌కు తీసుకొచ్చింది త‌ల్లి ఈశ్వ‌ర‌మ్మ‌. కుటుంబ స‌భ్యులు, బంధువుల‌ను ఆశ్ర‌యించినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో గోపాల్ పేట పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది ఈశ్వ‌ర‌మ్మ‌. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story