మహిళలకు“అమ్మకు అక్షరమాల” పరీక్ష

by Ratna Kumari |

మండల పరిధిలోని గ్రామ సంఘాల మహిళా సంఘ సభ్యురాళ్ల కోసం “అమ్మకు అక్షరమాల” పరీక్ష ఆదివారం నిర్వహించారు.

మహిళలకు“అమ్మకు అక్షరమాల” పరీక్ష
X

దిశ, వంగూర్ : మండల పరిధిలోని గ్రామ సంఘాల మహిళా సంఘ సభ్యురాళ్ల కోసం “అమ్మకు అక్షరమాల” పరీక్ష ఆదివారం నిర్వహించారు. వివిధ గ్రామాల మహిళా సోదరీమణులు ఈ పరీక్షలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎం శ్రీదేవి మాట్లాడుతూ.. ఈ పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిందని అన్నారు. మండల వ్యాప్తంగా మొత్తం 981 మంది నమోదు చేసుకోగా, అందులో 768 మంది మహిళలు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో సుమారు 78% మంది విజయవంతంగా పరీక్షను పూర్తి చేశారు. ఈ పరీక్ష మహిళల్లో అక్షరాస్యత పెంపొందించడానికి, ఆత్మవిశ్వాసం పెంచడానికి, ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని, ఈ పరీక్ష పాసైన వారికి ఐదవ తరగతి ఉత్తీర్ణత పత్రం లభిస్తుందని, ఇది పై చదువులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో గ్రామ సంఘాల ఇన్విజిలేటర్లుగా వీవోఏలు, గ్రామ సంఘ మహిళా అధ్యక్షురాళ్లు, సీసీలు, మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లు పాల్గొని పరీక్షను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేశారు.

Next Story