మోడీ ప్ర‌భుత్వం చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసే ప్ర‌య‌త్నం చేస్తోంది : పీసీసీ అధ్య‌క్షులు మ‌హేష్ కుమార్ గౌడ్

by Nallavelli.Anjaneyulu |

దిశ, అచ్చంపేట : దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి.. దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆనవాలు, నెహ్రు

మోడీ ప్ర‌భుత్వం చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసే ప్ర‌య‌త్నం చేస్తోంది : పీసీసీ అధ్య‌క్షులు మ‌హేష్ కుమార్ గౌడ్
X

దిశ, అచ్చంపేట : దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి.. దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆనవాలు, నెహ్రు కుటుంబానికి సంబంధించిన ఆడవాళ్లు ఉండకుండా కుట్రలు చేస్తూ ప్రధాని మోడీ చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం నాగ‌ర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న మాజీ ప్రధాని ఉక్కుమనిషి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి ఎమ్మెల్యే, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ కృష్ణతో కలిసి పూలమాలవేసి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉక్కు మనిషి అనే పేరు కొందరికే ఉంటుందని వారిలో స్వర్గీయ ఇందిరాగాంధీ మహిళకు దక్కడం దేశానికే గర్వకారణం అన్నారు. ఆనాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ దేశ ప్రజల కోసం గరీబి హటావో నినాదంతో సీలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చి భూస్వామ్యుల చెర నుంచి భూములను విడిపించి లక్షలాది ఎకరాలు సామాన్యులకు భూములను పంచడం, బ్యాంకుల జాతీయకరణ, బంగ్లాదేశ్ విషయంలో పాకిస్తాన్ యుద్ధం ప్రకటించడంతో ఆ యుద్ధంలో భారత్ గెలిపించి పాకిస్తాన్ కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందని ఆయన కొనియాడారు.

సీబీఐ ఈడీ ఎల‌క్ష‌న్ వారి చెప్పు చేతుల్లోనే

అధికారం లేకపోతే కేంద్ర ప్రభుత్వ పాలన చేస్తున్న వారు ఓటు చోరీకి పాల్పడి గద్దెనెక్కుతున్నారనని ఇటీవ‌ల జరిగిన బిహార్ ఎన్నికల్లో కూడా అదే జరిగిందని ఆయ‌న‌ ఆరోపించారు. ప్రధానంగా స్వయం ప్రతిపత్తి కలిగిన జాతీయ దర్యాప్తు సంస్థలైన ఈడి, సీబీఐ, ఎలక్షన్ కమిషన్ సైతం ప్రధాని మోడీ హోంశాఖ మంత్రి ఆడిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి విషయాల పట్ల సామాజిక అవగాహన ఉన్న మనలాంటి వ్యక్తులందరూ కూడా తప్పక ప్రశ్నించాలని, యువత మేలుకొని సామాజిక చైతన్యంతో కేంద్ర ప్రభుత్వం విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. నెహ్రూ కుటుంబం ఆస్తులు పదవులు ప్రాణాల సైతం త్యాగం చేశారని అలాంటి నాయకత్వం ఏ పార్టీ అయినా చేసిందా అని సూటిగా ప్రశ్నించారు. పార్టీ అధినేత సోనియా గాంధీ, ఖ‌ర్గే ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు.

ఏళ్ల‌లో చేయ‌ని అభివృద్ధి రెండేళ్ల‌లో చేశాం

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏర్పడిందని, పై నినాదాలతో అధికారం చేజిక్కించుకున్న‌ కేసీఆర్ ప్రభుత్వం గత పాలకులు 10 ఏళ్లలో అభివృద్ధికి విగాథంగా ఉన్నారని వారు చేయలేని అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండేళ్లలో అభివృద్ధి సంక్షేమ పథకాలను సమపాలుగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు. సీనియర్ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అభివృద్ధిపై చాలెంజ్ విసిరిన విషయంలో వాస్తవం ఉందన్నారు. వారు కేవలం 50 వేల ఉద్యోగాలు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే 70 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. రానున్న రోజులలో 3లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు అందించే లక్ష్యంగా ముందుకు ఈ ప్రభుత్వం వెళ్తుంద‌న్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. నెహ్రూ కుటుంబం నుంచి దేశ పరిపాలన పగ్గాలు పట్టుకున్న స్వర్గీయ ఇందిరాగాంధీ ఏకంగా 18 సంవత్సరాల పాటు ఒక మనిషిగా దేశంలో సెక్రరిజాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టిందన్నారు. ప్రధాని మోడీ నెహ్రూ కుటుంబాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అలా చేయడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయని అభివృద్ధి అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి దీవెనలతో రెండు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిపై ఛాలెంజ్ చేస్తున్నానని అన్ని విషయాలు డిసెంబర్ 07న మీడియా సమక్షంలో వెల్లడిస్తానన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి అరుణ, మల్లేష్, కుందా మల్లికార్జున్, అనిల్, ఉమామహేశ్వర చైర్మన్, బీరం మాధవరెడ్డి, దర్గా కమిటీ చైర్మన్ రఫీ, విజయ డైరీ చైర్మన్ నర్సయ్య యాదవ్, మాజీ ఎంపీపీ రామనాథం, మండల పార్టీ అధ్యక్షులు అనంత రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story