- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే సహించేదే లేదు : మంత్రి జూపల్లి కృష్ణారావు
దిశ, కొల్లాపూర్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కొన్ని గ్రామాలలో వేలం పాటలు, బలవంతపు ఏకగ్రీవాలు

దిశ, కొల్లాపూర్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కొన్ని గ్రామాలలో వేలం పాటలు, బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయనే సమాచారం తనకు అందిందని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రజల స్వేచ్ఛకు చైతన్యానికి విరుద్ధం అని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడారు. సర్పంచ్ ఆశావాహులు, ప్రజలతో ఉన్నవారు ప్రజా తీర్పు కోరండి. ప్రజాస్వామ్య తీర్పుతో వచ్చే పదవులను వేలం పాట ద్వారా పొందే వ్యక్తులు నా దగ్గరకు రావద్దని సూచించారు. పల్లె సీమలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అని.. అలాంటి పల్లెల్లో ప్రజాస్వామ్యం పరడవిల్లాలి కానీ, ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా ఇద్దరు వ్యక్తులు లేదా, ప్రజా తీర్పులపై విలువ లేని నాయకస్వామ్యం ప్రజల చైతన్యాన్ని కాలరాసే విధంగా వేలం పాటల ద్వారా పదవులు పొందడం ఏకగ్రీవం కాదన్నారు.
ఈ చర్య ఆధిపత్యం చేసే వ్యక్తుల తీర్పు అవుతుందే కానీ ఏకగ్రీవం కాదని, బలవంతపు వేలంపాటల ద్వారా పదవులు దక్కించుకున్న వారు ప్రజల కష్టాల్లో భాగస్తులు కాలేరని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేరు. నియంతలుగా మారి ఏకోన్ముఖ పాలన చేస్తారని మంత్రి జూపల్లి కృష్ణా రావు పేర్కొన్నారు. వారు గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించలేరు. ఇది ధనస్వామ్యం అవుతుంది తప్పా! ప్రజాస్వామ్యపు తీర్పు కాదు. ప్రజాస్వామ్య ప్రక్రియను వేలం సరుకుగా మార్చడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తునట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తమ అభిప్రాయం ప్రకారం ఓటు వేసి సర్పంచ్ లను ఎన్నుకోండి. వేలం పాటలు, ధన ప్రలోభాలు అభివృద్ధిని భంగ పరుస్తాయని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ పసుపుల నరసింహ, ఖాదర్ పాషా ఉన్నారు.






