- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోగిని నిమ్స్ లో చేర్పించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
గండీడ్ మండలానికి చెందిన వి. గోనియా కిడ్నీలు ఫెయిల్ కావడం, లివర్, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుండటంతో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కె.హన్మంత్ నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.

దిశ, మహమ్మదాబాద్/ గండీడ్: మాన్సూర్‌పల్లి తండా, గండీడ్ మండలానికి చెందిన వి. గోనియా కిడ్నీలు ఫెయిల్ కావడం, లివర్, లంగ్స్‌కు సంబంధించిన తీవ్రమైన సమస్యలతో బాధపడుతూ అత్యవసర వైద్యం అవసరమైన పరిస్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కె. హనుమంత్ రోగిని హైదరాబాద్‌లోని ప్రభుత్వ నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, రోగికి అవసరమైన అన్ని రకాల ఉత్తమ వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు. అలాగే రోగి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కోరారు. రోగి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని తెలిపారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్. మోతీరాం, కె. కిషన్ పాల్గొన్నారు.






