అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం..

by Disha Web Desk 11 |
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం..
X

దిశ, మద్దూరు: నారాయణ పేట జిల్లా మండల పరిధిలోని ధంగాన్ పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో రూ. కోటి 70లక్షలతో 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రం, రూ. 20లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, స్మశాన వాటిక రూ. 12లక్షలతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లో ఓల్టేజితో సమస్యతో సతమతమవుతున్న రైతులకు ఎమ్మెల్యేగా ఎంపిక అయినప్పటీ నుంచి నియోజక వర్గంలో 11 ఉపకేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు.

అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమానికి పదివేల కోట్ల విద్యుత్ బిల్లు చెల్లిస్తూ ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్, అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి నూతన భవనాన్ని నిర్మించి పాలన వ్యవస్థను ప్రజల దరిదాపులకు తీసుకురావడమే కేసీఆర్ ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సురేఖ చెన్నారెడ్డి, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరారెడ్డి, విద్యుత్ అధికారులు డీఈ, ఏడీ, ఏ ఈ మహేష్ కుమార్,ఎంపిడిఓ విజయ లక్ష్మి,సీనియర్ నాయకులు బాల్ సింగ్,విజయ భాస్కర్ రెడ్డి, శివకుమార్, పొన్నయ్య తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed