- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి: ఎమ్మెల్యే మేఘా రెడ్డి
దిశ, వనపర్తి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించదు కానీ.. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు బీసీ రిజర్వేషన్ బిల్లుకు

దిశ, వనపర్తి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించదు కానీ.. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతారా..? అని ప్రశ్నించారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. శనివారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మేఘారెడ్డికి సంబంధించిన మాస్క్ లు ధరించి మద్దతు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మెఘా రెడ్డి ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కులగణన చేయించి, బీసీ వర్గాలకు 42 % రిజర్వేషన్ అసెంబ్లీ లో తీర్మానం చేసి, బిల్లు ఆమోదం కోసం గవర్నర్ కు, కేంద్ర ప్రభుత్వానికి పంపినట్టు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బిల్లు ను ఆమోదం తెలుపకుండా బీసీ సంఘాల బంద్ కి మద్దతు తెలపడం హాస్యాస్పదం అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కి ఆమోదం తెలపకపోవడంతోనే జీ.ఓ 9 నీ జారీ చేయడం ద్వారా స్థానిక ఎన్నికలలో 42%బీసీ రిజర్వేషన్ ని అమలు చేశామని.. కానీ కోర్టు స్టే విధించిందని తెలిపారు. బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు చేతనైతే కేంద్ర ప్రభుత్వంతో 42 శాతం బీసీ బిల్లును ఆమోదింపచేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపని బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో తిరిగే నైతిక హక్కు కోల్పోయారన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర చందర్, నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, మాజీ కౌన్సిలర్లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






