విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి : ఎమ్మెల్యే మేఘారెడ్డి

by Ratna Kumari |

దిశ‌, వ‌న‌ప‌ర్తి : విద్యార్థులు విద్యను అభ్యసించడంతోపాటు క్రీడలలోను రాణించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి బుధవారం బాలకృష్ణయ్య క్రీడా

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి : ఎమ్మెల్యే మేఘారెడ్డి
X

దిశ‌, వ‌న‌ప‌ర్తి : విద్యార్థులు విద్యను అభ్యసించడంతోపాటు క్రీడలలోను రాణించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి బుధవారం బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాలబాలికలకు నిర్వహిస్తున్నఅండర్ 14, అండర్ 17 ఖోఖో, కబాడీ, వాలీబాల్, చెస్ అథ్లెటిక్స్ పోటీలను క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా మానసికంగా, శారీరకంగా దృడంగాఉండాలనిసూచించారు. క్రీడాపోటీలలో గెలుపు ఓటములు సహజమని ఓటమి చెందిన విద్యార్థులు మరోసారి ప్రయత్నం చేసి విజయం సాధించేందుకు పట్టుదలతో ప్రయత్నించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆడిన క్రీడా మైదానాన్ని అత్యాధునిక క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దేందుకు రూ.50 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. రూ.15 కోట్ల రూపాయలతో జిమ్, స్విమ్మింగ్ ఫుల్, నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. శ్రీనివాసపురం శివారులోని 55వ సర్వే నెంబర్లు క్రీడా పాఠశాల నిర్మించుకునేందుకు సైతం ఎమ్మెల్యేగా నేను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా శివసేన రెడ్డి, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభ్యర్థుల మేరకు క్రీడా పాఠశాల మంజూరు అయినట్లు అయన తెలిపారు. క్రికెట్ మైదానం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, క్రీడలు, యువజన శాఖ జిల్లా అధికారి సుధీర్ రెడ్డి, ఎస్.జి.ఎఫ్ కార్యదర్శి బోలమోని కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ పాల్గొన్నారు.

Next Story