ఓటు హక్కును బీజెపీ కలుషితం చేసింది : ఎమ్మెల్యే మ‌ధుసూధ‌న్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను నిర్ణయిస్తారని, ఎంతో ప్రాధాన్యత

ఓటు హక్కును బీజెపీ కలుషితం చేసింది : ఎమ్మెల్యే మ‌ధుసూధ‌న్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను నిర్ణయిస్తారని, ఎంతో ప్రాధాన్యత కలిగిన ఓట్ల వ్యవస్ధను ఎన్నికల సంఘం సహకారంతో బీజేపీ కలుషితం చేసిందని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూధన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు ఆయన 'ఓట్ చోరి' కి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి కో ఆర్డినేషన్ సమావేశంలో నిర్వహించారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నాడని ఆయన విమర్శించారు. లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓట్ చోరీ కి సంబంధించిన ఆధారాలు బయటపెట్టినా ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. ఓట్ చోరీ కి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా, భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకునే ప్రయత్నం కు అందరం సంతకం చేసి ఓట్ చోరీ వ్యతిరేక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ కుమార్, మల్లు నర్సింహారెడ్డి, ఎన్పీ వెంకటేష్, బెక్కెరి అనిత, వసంత, సిరాజ్ ఖాద్రీ, షబ్బీర్ అహ్మద్, సిజె బెనహర్ పాల్గొన్నారు.

Next Story