సీసీఐ కొనుగోళ్ల పై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్

by Nallavelli.Anjaneyulu |

దిశ, గద్వాల క్రైమ్ : పత్తి కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు, ఆలస్యంగా

సీసీఐ కొనుగోళ్ల పై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్
X

దిశ, గద్వాల క్రైమ్ : పత్తి కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు, ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రైతులకు కొత్త యాప్ ఇబ్బందికరం

సీసీఐ కొనుగోలు ప్రక్రియలో మొబైల్ యాప్‌ను (కపాన్ కిసాన్ యాప్) ప్రవేశపెట్టడాన్ని ఎమ్మెల్యే తప్పుబట్టారు. "దేశంలో రైతులకు అంత టెక్నాలజీ లేదు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకొని కొనుగోలు కేంద్రానికి రావాలంటే రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది," అని అన్నారు.

కొనుగోలు చేయకూడదనే ఉద్దేశంతోనే కొత్త కార్యక్రమాలు

సీసీఐ కొత్త విధానాన్ని, ఆలస్యంగా కొనుగోళ్లను ప్రారంభించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. "సీసీఐ కొనుగోలు కేంద్రం ఆలస్యంగా ప్రారంభించడం 'దొంగలు పడ్డాక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుగా' ఉంది. ప్రైవేట్ వ్యాపారులు కొనుగోళ్లు ప్రారంభించి నెల రోజులు అయింది. దాదాపు 80 శాతం పత్తి ఇప్పటికే ప్రైవేట్ మార్కెట్‌కు వెళ్ళిపోయింది. ఇంకా మిగిలి ఉన్న 20 శాతం మాత్రమే ఇప్పుడు రైతుల వద్ద ఉంది," అని పేర్కొన్నారు. సీసీఐ, కొనుగోలు చేయకూడదనే ఉద్దేశంతోనే ఇటువంటి కొత్త కార్యక్రమాలను తీసుకొచ్చిందని ఆరోపించారు. దీని వల్ల రైతులకు నష్టం జరిగి, మధ్య దళారులకు మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

అధిక తేమ శాతం నిబంధనపై అభ్యంతరం

సీసీఐ కేవలం 8% నుంచి 12% తేమ శాతం ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామనడం దారుణమని ఎమ్మెల్యే అన్నారు. "ఆల్మోస్ట్ ఆల్ రోజు వర్షం పడుతుంది. ఈ సమయంలో 8 నుంచి 12 శాతం తేమ శాతంతో ఉన్న పత్తి ఒక్క రైతు కూడా తీసుకురాలేడు," అని అన్నారు.

రాష్ట్ర మంత్రి ఆలోచించాలి

ఈ విధానాలన్నింటిపై రాష్ట్ర మంత్రివర్యులు ఆలోచించి, సీసీఐ కొనుగోళ్లను సులభతరం చేయాలని కోరారు. గతంలో మాదిరిగా వాహనాలలో పత్తిని తీసుకొచ్చి, వేబ్రిడ్జిపై తూకం వేసి, రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బులు పడే విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సీసీఐ అధికారులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story