పార్టీ పిరాయింపులకు తాను పాల్పడలేదు : ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-17 12:46:22  IST  )

దిశ, జోగులాంబప్రతినిధి : పార్టీ పిరాయింపులకు పాల్పడ్డారని పది మంది ఎమ్మెల్యే పై కొందరు సుప్రీం కోర్టు కి

పార్టీ పిరాయింపులకు తాను పాల్పడలేదు : ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి
X

దిశ, జోగులాంబ ప్రతినిధి : పార్టీ పిరాయింపులకు పాల్పడ్డారని పది మంది ఎమ్మెల్యే పై కొందరు సుప్రీం కోర్టు కి పోయి పిటిషన్ వేయడంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పది మంది ఎమ్మెల్యే లను పార్టీ పిరయింపుల పై గతం లో వ్యక్తిగతంగా విచారించడం జరిగిందని బుధవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ పిరాయించినట్టు ఆధారాలు లేవని సుదీర్ఘ విచారణ అనంతరం ఎమ్మెల్యే ల అనర్హత పిటిషన్లను కొట్టివేయడం పై గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారలేదని గద్వాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని, తెలంగాణ మంత్రులను కలిశానన్నారు. గతం లో కూడా కెసిఆర్ ముఖ్యమంత్రి వున్నప్పుడు అనేక ప్రతిపక్ష నేతలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశారని ఆయన గుర్తు చేశారు. ఏదేమైనా స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తునానని ఆయన తెలిపారు.

Next Story