- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గేదెలు మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం
దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం జైన్ తిరుమలాపురం గ్రామంలో శుక్రవారం పూసల చెరువులో రైతులు మద్దుల కొల్ల మల్లయ్య, భాస్కర్ రెడ్డి కి

దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం జైన్ తిరుమలాపురం గ్రామంలో శుక్రవారం పూసల చెరువులో రైతులు మద్దుల కొల్ల మల్లయ్య, భాస్కర్ రెడ్డి కి సంబంధించిన 8గేదెలు కరెంట్ షాక్ తో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తిరుమలపురం గ్రామంలోని పాడి గేదెల మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. మృతి చెందడానికి గల కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కరెంట్ షాక్ గేదెలు మృత్యువాత పడుతున్నాయని తెలిసి కూడా నిర్లక్ష్య వైఖరీ వహించిన విద్యుత్ శాఖ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే మెఘారెడ్డి. ఎనిమిది గేదెలు మృతి చెందటంతో వాటి పిల్లలకు తల్లి పాలు లేక ఇబ్బంది పడుతున్నాయని ప్రభుత్వ సహాయ, సహకారాలు అందించాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు.
స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వపరమైన సహాయ, సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా ముద్దుల కొల్ల మల్లయ్య కు రూ.18000, భాస్కర్ రెడ్డి కి రూ.6000 నగదును అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు గ్రామంలో నెలకొన్న సమస్యలను వివరించారు. గ్రామంలో మురికి కాలువలు లేవని, విద్యుత్ స్తంభాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే అక్కడి నుంచి అధికారులతో మాట్లాడి వెంటనే గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోపాల్ పేట మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సత్యశీలారెడ్డి, కొంకి వెంకటేష్, కొంకి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.






