- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దర్గాను దర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
వంగూర్ మండలం సర్వారెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న 75 వ ఉర్సు షరీఫ్ (నెల్లిగుట్ట) దర్గాలో జరుగుతున్న వార్షిక జాతర సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దర్గాను దర్శించారు.

దిశ, వంగూర్: వంగూర్ మండలం సర్వారెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న 75 వ ఉర్సు షరీఫ్ (నెల్లిగుట్ట) దర్గాలో జరుగుతున్న వార్షిక జాతర సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దర్గాను దర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రాంత ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. ఉర్సు షరీఫ్ జాతర అన్ని మతాల మధ్య సామరస్యాన్ని ప్రతిబింబించే ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ జాతర సందర్భంగా దర్గాకు విచ్చేసిన భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ ఉర్సు జాతర విజయవంతంగా కొనసాగాలని ఎమ్మెల్యే అభిలషించారు. ఈ కార్యక్రమంలో సర్వారెడ్డిపల్లి సర్పంచ్ స్వర్ణ సంపత్ రావు, తహసిల్దార్ మురళీమోహన్, డిటి సుదర్శన్ రెడ్డి, వంగూర్ గ్రామ సర్పంచ్ యాదయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, దర్గా కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






