- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం
by Ratna Kumari |
కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, మక్తల్ : కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్ మండల పరిధిలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన నర్సోజి కూతురు ఉమామహేశ్వరి(20) శుక్రవారం ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. శనివారం వరకు తిరిగి రాలేదు. దీంతో బంధువులను, స్నేహితులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో శనివారం సాయంత్రం మక్తల్ పోలీసులకు తండ్రి నర్సోజి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.
Next Story






