తప్పిన బస్సు ప్రమాదం

by Ratna Kumari |

దిశ, ఊట్కూర్ : తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని కొ

తప్పిన బస్సు ప్రమాదం
X

దిశ, ఊట్కూర్ : తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని కొల్లూరు గేట్ సమీపంలో మక్తల్ నుంచి నారాయణపేటకు వెళ్తుండగా ఒక్కసారిగా బస్ కమాన్ పట్టిలు త‌ప్పాయి. దీంతో బ‌స్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ కళ్ళప్ప చాక చక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇందులో దాదాపు 20 మంది వరకు ప్ర‌యాణికులు ఉన్నట్లు స‌మాచారం. ఈ ఘటన లో పలువురి కు చిన్న చిన్న గాయాలు అయినట్లు తెలుస్తోంది. పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story