కృష్ణా న‌దిపై వంతెన నిర్మాణం ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి : మంత్రి వాకిటి శ్రీహ‌రి

by Ratna Kumari |

కృష్ణా న‌ది పై వంతెన నిర్మాణం ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహ‌రి హెచ్చ‌రించారు.

కృష్ణా న‌దిపై వంతెన నిర్మాణం ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి :  మంత్రి వాకిటి శ్రీహ‌రి
X

దిశ‌, మ‌క్త‌ల్ : కృష్ణా న‌ది పై వంతెన నిర్మాణం ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహ‌రి హెచ్చ‌రించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న గ‌ద్వాల ఎమ్మెల్యే కృష్ణ‌మోహ‌న్ రెడ్డితో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలో రూ.123 కోట్ల‌తో కృష్ణాన‌దిపై జూరాల ప్రాజెక్ట్ దిగువ‌న కృష్ణా న‌ది పై నిర్మించ‌నున్న బ్రిడ్జీ పై సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. ఈ బ్రిడ్జీ నిర్మాణం పూర్త‌యితే వ‌న‌ప‌ర్తి నుంచి మంత్రాల‌యం వ‌ర‌కు ఎమ్మిగ‌నూరు వెళ్లే ప్ర‌యాణికుల‌కు దాదాపు 40 కి.మీ. దూరం త‌గ్గుతుంద‌ని మంత్రి తెలిపారు. వ‌న‌ప‌ర్తి నుంచి వ‌యా కొత్త‌కోట‌, మ‌ద‌నాపురం, ఆత్మ‌కూరు, గ‌ద్వాల మీదుగా మంత్రాల‌యం వెళ్ల‌వ‌చ్చ‌ని.. నాలుగే లైన్ల ర‌హ‌దారి ఏర్ప‌డిన త‌రువాత ఆత్మ‌కూరులో ర‌వాణా ర‌ద్దీ పెరుగుతుంద‌ని తెలిపారు. ఆత్మ‌కూరు-గ‌ద్వాల మ‌ధ్య రాక‌పోక‌లు సాగించే ప్ర‌యాణికుల‌కు చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు. ఈ వంతెన‌తో నారాయ‌ణ‌పేట‌, వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల మూడు జిల్లాల ప్ర‌జ‌ల‌కు.. నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌కు లాభం చేకూరుతుంద‌న్నారు. విద్య‌, వ్యాపారాల‌కు చాలా లాభం క‌లుగుతుంద‌ని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం ఈ ప్రాంత ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌పై పడుతున్న అవ‌స్థ‌ల‌పై దృష్టికి తీసుకెళ్లిన ప‌ట్టించుకోలేద‌ని.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఎమ్మెల్యే గెలిచి మంత్రిని అయ్యాక మీ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాన‌ని.. ఇక్క‌డ వంతెన వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేద‌న్నారు. మ‌క్త‌ల్, గ‌ద్వాల‌, దేవ‌ర‌కద్ర‌, వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యేల‌ త‌ర‌పున సీఎం కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు మంత్రి వాకిటి శ్రీహ‌రి.

Next Story