- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జడ్చర్ల అభివృద్ధికై అనిరుద్ రెడ్డి కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా
తాను రాష్ట్ర మంత్రి కావాలని అందరికంటే ముందుగా కోరుకున్న వ్యక్తి అనిరుద్ రెడ్డి అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

దిశ, జడ్చర్ల : తాను రాష్ట్ర మంత్రి కావాలని అందరికంటే ముందుగా కోరుకున్న వ్యక్తి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని జౌకి నగర్‌లో నిర్మితమైన సెట్విన్ శిక్షణా కేంద్రం,47 లక్షల వ్యయంతో హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ సౌజన్యంతో సి.ఎస్.ఆర్ నిధులతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రం నూతన భవనాలను మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చెందిన కార్యక్రమాల్లో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ... ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో అగ్నిమాపక విభాగానికి తగిన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఆధునిక పరికరాలు, సిబ్బంది ఈ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జడ్చర్ల పరిసర ప్రాంతాలకు ఈ కేంద్రం భద్రతా పరంగా మేలైన తోడ్పాటు అందిస్తుందని మంత్రి తెలిపారు. మండల స్థాయిలో కూడా అగ్నిమాపక కేంద్రాలు విస్తరించేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన సూచించారు. అనంతరం పట్టణంలోని జాకీ నగర్ లో ఏర్పాటుచేసిన సిట్విన్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నిరుద్యోగ యువతకు టెక్నికల్ నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
ముదిరాజ్ సోదరుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ టి జ్యోతి మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత,వైస్ చైర్ పర్సన్ పాలాది సారిక ,ఆర్.డి. ఓ.నవీన్,జిల్లా అగ్నిమాపక అధికారి కిషోర్, హెటిరో ల్యాబ్స్ ప్రతినిధులు సుధాకర్,రవికిరణ్,ఫణి ,మున్సిపల్ కౌన్సిలర్ చైతన్య చౌహాన్,మున్సిపల్ కమిషనర్ లక్ష్మా రెడ్డి,తహశీల్దార్ నర్సింగ రావు పాల్గొన్నారు.






