ఎట్ట‌కేల‌కు పంతం నెగ్గించుకున్న మంత్రి వాకిటి శ్రీహ‌రి

by Ratna Kumari |

దిశ‌, మ‌క్త‌ల్ : కోడంగల్ ఎత్తి పోతల పథకంలో మక్తల్, నారాయణపేట, కొడంగల్, ఎత్తి పోతల పథకంగా పేరు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తో పంతం పట్టిన మంత్రి వాకిటి శ్రీహరి చివరికి తన పంతం

ఎట్ట‌కేల‌కు పంతం నెగ్గించుకున్న మంత్రి వాకిటి శ్రీహ‌రి
X

దిశ‌, మ‌క్త‌ల్ : కోడంగల్ ఎత్తి పోతల పథకంలో మక్తల్, నారాయణపేట, కొడంగల్, ఎత్తి పోతల పథకంగా పేరు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తో పంతం పట్టిన మంత్రి వాకిటి శ్రీహరి చివరికి తన పంతం సాధించుకొని ఎట్టకేల‌కు తెలంగాణ ప్రభుత్వం నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరు మార్పు చేసింది. మక్తల్ -నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకంగా మారుస్తూ జీవో విడుదల చేసింది. కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మొక్కలు మండలంలోని భూత్పూర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుండే తీసుకెళ్తున్నందున ఈ పథకానికి మక్తల్ నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకంగా నామ కరణం చేయాలని గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాకిటి శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డితో పట్టుబట్టారు. చివరకు మంత్రి హోదా రావడంతో పథకానికి మక్తల్ పేరు చేర్చాలని పట్టుబట్టడంతో ఎత్తిపోతల పథకంగా మారుస్తూ జీవో విడుదల చేసింది.

Next Story