గాయ‌ప‌డిన కార్య‌క‌ర్త‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి వాకిటి శ్రీహ‌రి

by Ratna Kumari |

బీజేపీ కార్య‌క‌ర్త‌ల దాడిలో గాయ‌ప‌డిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త జ‌గ‌దీశ్ ని, కుటుంబాన్ని గురువారం మంత్రి వాకిటి శ్రీహ‌రి ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు.

గాయ‌ప‌డిన కార్య‌క‌ర్త‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి వాకిటి శ్రీహ‌రి
X

దిశ‌, మ‌క్త‌ల్ : బీజేపీ కార్య‌క‌ర్త‌ల దాడిలో గాయ‌ప‌డిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త జ‌గ‌దీశ్ ని, కుటుంబాన్ని గురువారం మంత్రి వాకిటి శ్రీహ‌రి ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. గ‌త ఎన్నిక‌ల్లో కూడా త‌మ కొడుకు పై ఇలాంటి దాడి జ‌రిగింద‌ని బాధితుడి త‌ల్లి మంత్రి ముందు బోరున విల‌పించింది. బుధ‌వారం మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణంలోని మొద‌టి వార్డులో బీజేపీ- కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా కాంగ్రెస్ కార్య‌క‌ర్త జ‌గ‌దీష్ బీజేపీ కార్య‌క‌ర్త మ‌హ‌దేవ్ ని ప‌ల‌కరించి చేతులు క‌లుపుకోవ‌డంలో మ‌జాక్ చేసుకోవ‌డం అది చూప‌రుల‌కు ఏదో జ‌రుగుతుంద‌ని భావించి.. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌పై బీజేపీ కార్య‌క‌ర్త‌లు మూకుమ్మ‌డిగా దాడి చేశారు. ఈ దాడి వివాదంగా మారింది. దీంతో రెండు పార్టీల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు జోక్యం చేసుకొని వివాదాన్ని స‌ద్దుమ‌ణిగేలా చేసారు. జ‌రిగిన దానిపై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం.

Next Story