గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకుందాం

by velandi.Saikiran |

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని మంత్రి శ్రీహరి సూచించారు. మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ హనుమాన్

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకుందాం
X

దిశ, ఊట్కూర్ : గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని మంత్రి శ్రీహరి సూచించారు. మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ హనుమాన్ దేవాలయంలో ప్రతిష్టించిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని వినాయకుడి లడ్డు స్కీమ్ లో గెలుపొందిన సభ్యుడు పేరును ప్రకటించారు. ఎటువంటి ఆటంకాలు జరగకుండా నిమజ్జన శోభయాత్ర జరిగేలా చూడాలని పోలీసులకు సూచించారు. పలు సమస్యల గురించి మంత్రి శ్రీహరి కు నాయకులు వివరించారు. ఎంపీడీవో ధనుంజయ గౌడ్, సిఐ రామ్ లాల్, ఎస్ఐ రమేష్, నాయకులు సూర్య ప్రకాష్ రెడ్డి, రవి, అరవింద్, యగ్నేశ్వర్ రెడ్డి, భరత్, లింగం, మహేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story