TRS అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుంది.. Minister Singireddy Niranjan Reddy

by Javid Pasha |
TRS అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుంది.. Minister Singireddy Niranjan Reddy
X

దిశ, వనపర్తి: నియోజకవర్గంలో తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత మార్కెట్, తాళ్ల చెరువు, నాగవరం శివారులో రాక్ పార్క్ పనులను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సాగునీటి, రెవెన్యూ, మున్సిపాలిటీ శాఖల అధికారులకు మంత్రి పలు సూచనలు చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జాప్యం లేకుండా నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

వనపర్తి పాత వ్యవసాయ మార్కెట్ ప్రదేశంలో రూ.49 కోట్ల అంచనా వ్యయంతో నూతన సమీకృత మార్కెట్, రూ.2 కోట్ల అంచనా వ్యయంతో వే సైడ్ మార్కెట్ నిర్మాణ పనులను చేపట్టామని తెలిపారు. వనపర్తి పట్టణ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా వేచి చూస్తున్న రోడ్డు విస్తరణ పనులను పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్, తహసీల్దార్ రాజేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more:

రాజీనామా చేయాలంటూ మరో TRS ఎమ్మెల్యేకు ఫోన్ కాల్... ఆడియో వైరల్

Next Story

Most Viewed