- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : అధికారులపై మంత్రి జూపల్లి ఫైర్
by Muthe.Rajitha |
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని మున్ననూరులో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో నేడు మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ..' గీతం ప్లే చేశారు అధికారులు. అయితే అది సౌండ్ క్లారిటీ లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీకు సెన్స్ లేదా? రాష్ట్ర గీతాన్ని ప్లే చేసే విధానం ఇదేనా అంటూ మండి పడ్డారు. కార్యక్రమం గురించి ముందే సమాచారం ఉన్నపుడు చెక్ చేసుకోకుండా ఏం చేస్తున్నారు? ఇంత నిర్లక్ష్యం ఎందుకని నిలదీశారు. అంతేకాదు మరోసారి ఇలా జరిగితే సస్పెండ్ చేస్తానని సంబంధిత అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం.
Next Story






