- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లోకి తహసిల్దార్లు : మంత్రి జూపల్లి కృష్ణారావు
రైతుల భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లోకి తహసిల్దార్లు వస్తున్నారని పేర్కొన్నారు మంత్రి జూపల్లి కృష్ణా రావు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్

దిశ, నాగర్ కర్నూల్ : రైతుల భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లోకి తహసిల్దార్లు వస్తున్నారని పేర్కొన్నారు మంత్రి జూపల్లి కృష్ణా రావు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, లతో కలిసి భూ భారతి రైతు సదస్సుల్లో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు తహశీల్దార్ లతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకే భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయకుంటే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుందని, ప్రజలకు నమ్మకం పెంచేలా రెవెన్యూ అధికారులు సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, ప్రతి సమస్యను పరిష్కారాలకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి అధికారులు ఆదేశించారు.
వాస్తవాలకు భిన్నంగా ఏ అధికారి ప్రవర్తించిన కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులకు సమస్యల పరిష్కారానికి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భూ భారతి చట్టం అమల్లోకి వచ్చి 6 మాసాలు పూర్తి కావస్తున్నా ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా ఆశించిన స్థాయిలో రైతులకు పరిష్కారం అందలేదని, సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నవంబర్ 1వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు తహసిల్దార్లు ప్రతిరోజు ఉదయం 8 గంటలకే గ్రామాల్లో సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామస్థాయిలో రైతులతో నిర్వహించే సమావేశానికి స్థానిక పోలీసులు హాజరయ్యేలా చూడాలని, అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని జిల్లా ఎస్పీకి మంత్రి సూచించారు.ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా రెవెన్యూ అధికారులు గ్రామస్థాయి రెవెన్యూ అధికారులను భాగ్యస్వామ్యం చేసి దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.






