మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఈఓ పోస్ట్ ఖాళీ..!

by Ratna Kumari |   (  Updated:2025-11-06 11:50:55  IST  )

దిశ‌, మ‌క్త‌ల్ : మ‌క్త‌ల్ అంటే మంత్రి వాకిటి శ్రీహ‌రి నియోజ‌క‌వ‌ర్గం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌ల విద్యాధికారి పోస్ట్ ఖాలీ అయింది. మండలంలో పలు పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను సర్దుబాటులేక మండల

మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఈఓ పోస్ట్ ఖాళీ..!
X

దిశ‌, మ‌క్త‌ల్ : మ‌క్త‌ల్ అంటే మంత్రి వాకిటి శ్రీహ‌రి నియోజ‌క‌వ‌ర్గం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌ల విద్యాధికారి పోస్ట్ ఖాలీ అయింది. మండలంలో పలు పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను సర్దుబాటులేక మండల వ్యవస్థ కుంటు పడింది. వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎంఈఓ ని నియమించడం ఇతరులకు అదనపు బాధ్యతలు అప్పగించిన దాఖలు లేవు. నియోజకవర్గ కేంద్రంలో ఎంఈఓ ని నియమించ‌కుండా జిల్లా అధికారులు నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌నం. మండ‌లంలో విద్యా వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన వివ‌రాల‌ను అడిగితే చెప్పే వారు లేక ప్ర‌శ్నార్థ‌కంగా మిగిలిపోయింది.

టీచ‌ర్ల కొర‌త..

గ‌త నెల మండ‌ల విద్యాధికారి అనిల్ గౌడ్ రిటైర్మెంట్ అయ్యారు. మండ‌లంలో ఉన్న పాఠ‌శాల‌లో టీచ‌ర్ల కొర‌త వేధిస్తుండ‌గా.. మున్సిప‌ల్ కేంద్రంలో బీసీ కాల‌నీ, బాబు జ‌గ్జీవ‌న్ రామ్ కాల‌నీలో ప్రైమ‌రీ స్కూల్ లో ప్రారంభించారు. అక్క‌డ ఇప్ప‌టివ‌ర‌కు టీచ‌ర్ల‌ను నియ‌మించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పేరుకు మాత్ర‌మే పాఠ‌శాల ఉండి ఆ ప్రాంతంలోనే విద్యార్థులు పాఠ‌శాల‌కు వ‌స్తున్నారు. కానీ పాఠాలు బోధించేందుకు ఇత‌ర పాఠ‌శాల‌లో ప‌ని చేస్తున్న టీచ‌ర్లు వంతుల వారీగా తాత్కాలికంగా విధులు నిర్వ‌హిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అవకాశం దొరికితే చాలు విధులకు గైరాజరై సొంత పనుల కోసం టీచర్లు ఆస‌క్తి ఎక్కువ‌గా చూపిస్తున్నారు. మరోవైపు వారంద‌రినీ నియంత్రించే విద్యాధికారి లేక‌పోవ‌డంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాత్కాలిక మండ‌ల విద్యాధికారి బాధ్య‌త‌లు అప్ప‌గించాలి

మండ‌లంలో దాదాపు 10కి పైగా ప్రైవేట్ పాఠ‌శాల‌లు ఉన్నాయి. మ‌క్త‌ల్ మండ‌లంలో మూడు క్ల‌స్ట‌ర్ల‌లో ఉన్న హై స్కూల్, ప్రైమ‌రీ, అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూల్ బాగోగుల‌ను గెజిటేడ్ హెడ్ మాస్ట‌ర్లు నిర్వ‌హిస్తున్నారు. మ‌క్త‌ల్ క్ల‌స్ట‌ర్ బాయ్స్ హైస్కూల్ కింద మూడు హైస్కూల్స్, ఆరు అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూళ్లు, 13 ప్రైమ‌రీ స్కూళ్లు, జ‌క్లెర్ క్ల‌స్ట‌ర్ కింద మూడు హైస్కూల్స్, రెండు అప్ప‌ర్ ప్రైమ‌రీ, 12 ప్రైమ‌రీ స్కూల్స్, క‌ర్నీ క్ల‌స్ట‌ర్ కింద రెండు హైస్కూల్, 5 అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూల్స్ 14 ప్రైమ‌రీ స్కూల్స్ కొన‌సాగుతున్నాయి. ప్ర‌తీ క్ల‌స్ట‌ర్ గెజిటేడ్ సీనియ‌ర్ హెడ్మాస్ట‌ర్ విధులు నిర్వ‌హిస్తున్నారు. వీరి ముగ్గురిలో ఎవ‌రికో ఒక‌రికి తాత్కాలిక మండ‌ల విద్యాధికారి బాధ్య‌త‌లు అప్ప‌గించాల్సి ఉంది. మండ‌ల విద్యాధికారి లేక‌పోవ‌డంతో మండ‌లంలో టీచ‌ర్లు లేని పాఠ‌శాల‌లో టీచ‌ర్ల స‌ర్దుబాటు.. మ‌ధ్యాహ్న భోజ‌న వ్య‌వ‌స్థ‌ను ప‌ర్య‌వేక్షించ‌డం జ‌రుగుతోంది. ప్రైవేట్ పాఠ‌శాల‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌, జిల్లా అధికారుల‌కు జ‌వాబు దారి లేక‌పోవ‌డం, మండ‌ల విద్యావ్య‌వ‌స్థ బాగోగుల‌ను చూసుకునే బాధ్య‌త మండ‌ల విద్యాధికారిపై ఉంటుంది.

విద్యాధికారిని నియ‌మించే ఏర్పాటు చేయాలి

మ‌క్త‌ల్ మండ‌లంలో దాదాపు 36 గ్రామ‌పంచాయ‌తీల్లో 8 హైస్కూల్స్ 13 అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూల్, 39 ప్రైమ‌రీ స్కూల్ కొన‌సాగుతుండ‌గా ఖానాపురం, చందాపురం పాఠ‌శాల‌లో టీచ‌ర్ల కొర‌త వేధిస్తుండ‌గా.. ఇత‌ర కార‌ణాల‌పై ఉన్న టీచ‌ర్లు వైద్య కారణాలు చెబుతూ దీర్ఘ‌కాలిక సెల‌వుల్లో వెళ్లిపోతున్నారు. అన‌ధికారికంగా టీచ‌ర్లు డిప్యూటేష‌న్ పై కొన‌సాగుతుండ‌గా.. స్థానిక మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు ప్రైమ‌రీ పాఠ‌శాల‌ల్లో టీచ‌ర్లు లేరు. మండ‌లంలో అవ‌స‌ర‌మైన చోట టీచ‌ర్ల‌ను స‌ర్దుబాటు చేస్తూ విద్యావ్య‌వ‌స్థ కుంటుప‌డ‌కుండా విద్యార్థుల‌కు న‌ష్టం క‌లుగ‌కుండా రిటైర్మెంట్ అయిన ఎంఈఓ స‌ర్దు బాటు చేసేవాడు. ప్ర‌స్తుతం స‌ర్దుబాటు చేసే అధికారులు లేక‌పోవ‌డంతో టీచ‌ర్ల‌కు, విద్యార్థుల‌కు ఆట‌విడుపుగా మారిపోయింది. ఇప్ప‌టికైనా జిల్లా విద్యాధికారి చొరువ తీసుకొని విద్యాధికారిని నియ‌మించే ఏర్పాటు చేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story