రెడ్ క్రాస్ సేవలు విస్తరించేందుకు సభ్యత్వ నమోదు చేపట్టాలి

by Ratna Kumari |

రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తరించేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు.

రెడ్ క్రాస్ సేవలు విస్తరించేందుకు సభ్యత్వ నమోదు చేపట్టాలి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తరించేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రి డ్యూనాంట్ చిత్ర పటానికి కలెక్టర్ పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. మీ సభ్యత్వ నమోదు విపత్తులు, వరదలు, ఆపదలో అత్యవసర వైద్య సహాయం, రక్త దానం, ప్రాణ రక్షణ బాధితులకు సాయం అందుతుందని ఆమె అన్నారు. ఈనెల 15 నుంచి జూన్ 15 వరకు నిర్వహించే రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖాధికారులు, ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకువచ్చి రెడ్ క్రాస్ సభ్యత్వం స్వీకరించి రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. ముందుగా కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజ్ కు మొదటి సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మెన్ నటరాజ్, కోశాధికారి జగపతిరావు, జిల్లా ఉపాధి అధికారి మైత్రి ప్రియా, కార్మిక శాఖ ఉప కమీషనర్ చంద్రశేఖర్, శ్రీహరి, తిరుపతి రెడ్డి, బాబుల్ రెడ్డి, అశోక్ పాల్గొన్నారు.

Next Story