వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు

by Ratna Kumari |

మద్దూరు పట్టణ కేంద్రంలో వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రజా ప్రతినిధులు, అధికారులు అన్నారు

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా  చర్యలు
X

దిశ, మద్దూరు : మద్దూరు పట్టణ కేంద్రంలో వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రజా ప్రతినిధులు, అధికారులు అన్నారు. శనివారం రెండో వార్డులో కౌన్సిలర్ నరసింహ సమక్షంలో మున్సిపల్ చైర్మన్ సరస్వతి జనార్ధన్, కమిషనర్ శ్రీకాంత్ బజారులోని గుత్త మల్లికార్జున్ ఇంటి దగ్గర పాత బోరుబావిని ప్రెస్సింగ్ చేయించారు. ఒకటి రెండు రోజుల్లో నూతన మోటర్ ను బిగిస్తామని అన్నారు. వార్డులోని పాత కల్లు దుకాణం దగ్గర ఉన్న బోరు బావి ని కూడా త్వరలోనే కాలనీ వాసులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముద్ది బీములు, 4 వ వార్డు కౌన్సిలర్ గోపాల్, మున్సిపల్ సిబ్బంది రాంనాయక్ నాయకులు బాలచందర్ గౌడ్, అశోక్, సాయిలు ,కృష్ణారెడ్డి ,భీమ్సేన్, గురు కర్ణ ,చంద్రు ,అంజి పాల్గొన్నారు.

Next Story