పేదింటి బిడ్డ కు ఎంబీబీఎస్ సీటు

by Ratna Kumari |

దిశ, పెద్దకొత్తపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్త పల్లి మండలం చంద్రకల్ గ్రామంలో నిరు పేద కుటుంబానికి చెందిన బండి వెంక‌టస్వామి కూతురు స్ర‌వంతికి ఎంబీబీఎస్ సీటు

పేదింటి బిడ్డ కు ఎంబీబీఎస్ సీటు
X

దిశ, పెద్దకొత్తపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్త పల్లి మండలం చంద్రకల్ గ్రామంలో నిరు పేద కుటుంబానికి చెందిన బండి వెంక‌టస్వామి కూతురు స్ర‌వంతికి ఎంబీబీఎస్ సీటు ల‌భించింది. మొద‌టి ఫేజ్ లో భూపాల‌ప‌ల్లి జిల్లా మెడిక‌ల్ క‌ళాశాల‌లో సీట్ సాధించిన స్ర‌వంతిని తండ్రి వెంక‌ట‌స్వామి మేస్త్రీ ప‌ని చేసుకుంటూ చ‌దివించారు. ప్రభుత్వ కళాశాలలో చదివి నీట్ లో సీట్ సాధించినదుకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బండి సాయిబాబు శాలువా తో సన్మించారు. ఈ సందర్బంగా ఆయ‌న మాట్లాడుతూ బాగా చదువు కొని పేదలకు డాక్టర్ గా సేవలందించాల‌న్నారు. నీట్ లో సీట్ రావడం పట్ల గ్రామ‌స్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు బాలకృష్ణ, హరికృష్ణ, రామస్వామి, వెంకటస్వామి పాల్గొన్నారు.

Next Story