జడ్చర్ల లో భారీ చోరీ.. ఒకే బిల్డింగు లో తాళం వేసిన రెండు ఇళ్ల‌లో చోరీ

by Nallavelli.Anjaneyulu |

జడ్చర్ల పట్టణంలో వరుస దొంగతనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంటికి తాళం వేసి వెళ్లి తిరిగి వచ్చి సరికి దుండగులు ఇంట్లో చొరబడి ఇల్లు గుల్ల చేస్తున్నారు.

జడ్చర్ల లో భారీ చోరీ.. ఒకే బిల్డింగు లో తాళం వేసిన రెండు ఇళ్ల‌లో చోరీ
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో వరుస దొంగతనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంటికి తాళం వేసి వెళ్లి తిరిగి వచ్చి సరికి దుండగులు ఇంట్లో చొరబడి ఇల్లు గుల్ల చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పట్టణ ప్రజలు నిత్యం భయాందోళనకు గురవుతున్నారు. జడ్చర్ల పట్టణం వెంకటపతి రావు కాలనీలో ఇంట్లో ఎవరు లేని సమయంలో గత రాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు ప‌గుల‌గొట్టి చోరీకి పాల్పడ్డారు. ఒకే బిల్డింగ్ లో అద్దె ఉంటున్న రెండు ఇళ్ల‌లో నివాసం ఉంటున్న మరియమ్మ, సరస్వతి అనే మహిళ ల ఇళ్ల‌లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని మరియమ్మ అనే మహిళ ప్రైవేట్ హాస్పిటల్ లో ఉద్యోగం చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే గత రాత్రి కూడా డ్యూటీ కి వెళ్లి ఇవాళ‌ తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూసేసరికి తలుపు తాళాలు విరగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే బీరువా తాళాలు ప‌గుల‌గొట్టి అందులో ఉన్న సామాగ్రిని, బట్టలను చిందర వంద‌ర‌ చేసి బీరువాలో ఉన్న ఆరు తులాల బంగారంతో పాటు వెండి ఆభరణాలు, 15 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిపింది. మరో బాధిత మహిళా సరస్వతి గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ కి వెళ్ళింది. ఆమె ఇంటి తాళాలు విరగొట్టి ఇంట్లో ఉన్న తులం బంగారు నగలతో పాటు 50 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ మహిళల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ను రప్పించి నిందితుల ఆధారాల కొరకు అన్వేషించి దర్యాప్తు చేపట్టారు. పది రోజుల వ్యవధిలోనే పట్టణంలోని వరుసగా మూడు చోట్ల దొంగతనాలు జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలే వేసవికాలం దానికి తోడు శుభకార్యాలు జరిగే సీజన్ కావడంతో ఇంట్లో నగలను దాచుకోవాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణ ప్రజలు రాత్రివేళ పెట్రోలింగ్ ను వేగవంతం చేసి ప్రజల ఆస్తుల రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Next Story