- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్టరేట్ సాధించిన మసారం ప్రేమ్ కుమార్
చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామానికి చెందిన అచ్చయ్య-సాయిలమ్మ దంపతుల కుమారుడు డా. మసారం ప్రేమ్ కుమార్ చిన్ననాటి నుంచే చదువులో చురుకుదనం, ఆలోచనాత్మక స్వభావంతో ముందుకు సాగారు.

దిశ, చందంపేట : చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామానికి చెందిన అచ్చయ్య-సాయిలమ్మ దంపతుల కుమారుడు డా. మసారం ప్రేమ్ కుమార్ చిన్ననాటి నుంచే చదువులో చురుకుదనం, ఆలోచనాత్మక స్వభావంతో ముందుకు సాగారు. ఉన్నత విద్యపై ఆసక్తితో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అనంతరం డాక్టరేట్ పట్టా సాధించారు. తన విద్యాభ్యాస ప్రయాణంలో తనకు తెలియకుండానే అండగా నిలిచి, ఎదుగుదలకు ప్రోత్సాహం అందించిన భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డా. స్టాలిన్ కి, మసారం ప్రేమ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. డాక్టరేట్ అవార్డు వచ్చిన సందర్భంగా డా. స్టాలిన్ ని మర్యాదపూర్వకంగా కలసి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న కుటుంబ సంబంధం కూడా విశేషమే. కామ్రేడ్ డా. స్టాలిన్, డా. మసారం ప్రేమ్ కుమార్ గారు బావ- బామ్మర్దులుగా ఉండగా.. డా. స్టాలిన్ గారికి స్వయానా మేనత్త కుమారుడే డా. మసారం ప్రేమ్ కుమార్ కావడం ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్రస్తుతం డా. మసారం ప్రేమ్ కుమార్ రాష్ట్ర క్రైస్తవ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందిస్తూ పేద ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, సామాజిక సేవ, ప్రజా సంక్షేమం వంటి రంగాలలో సేవలందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.






