వివాహిత అదృశ్యం

by Ratna Kumari |

వివాహిత అదృశ్యమైన సంఘటన లింగాల మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వివాహిత అదృశ్యం
X

దిశ, లింగాల : వివాహిత అదృశ్యమైన సంఘటన లింగాల మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం షాయిన్ పేట్ గ్రామానికి చెందిన జర్పాటి నందిని (22) అనే వివాహిత అదృశ్యమైంది. వినోద్నం- దిని దంపతుల వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ నెల 30న‌ ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో, వినోద్ తన పిల్లలతో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నందిని ఎవరికీ చెప్పకుండా ఇంటి తలుపు బయట నుంచి గడియ వేసి వెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం బంధువుల ఇళ్లలో, తెలిసిన ప్రాంతాల్లో వెతికినా నందిని ఆచూకీ లభించలేదన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం లింగాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story