- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహిత అదృశ్యం
దిశ, గోపాల్ పేట : మండల పరిధిలోని ఏదుట్ల గ్రామానికి చెందిన పల్లె అరుంధతి అనే మహిళ కనిపించడం లేదని గోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో శనివారం భర్త ఫిర్యాదు చేశాడు. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, గోపాల్ పేట : మండల పరిధిలోని ఏదుట్ల గ్రామానికి చెందిన పల్లె అరుంధతి అనే మహిళ కనిపించడం లేదని గోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో శనివారం భర్త ఫిర్యాదు చేశాడు. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఏదుట్ల గ్రామానికి చెందిన భోగది మహేష్ (28), పల్లె అరుంధతిని 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పల్లె అరుంధతి గత ఐదు నెలల నుంచి వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రజా వైద్యశాల ముందు గల సాయి మెస్ నందు పని చేస్తున్నది. ప్రతిరోజు ఉదయం వనపర్తికి వెళ్లి పని చేసిన అనంతరం తిరిగి ఏదుట్ల గ్రామానికి వస్తూ 21నవంబర్, 2025 రోజు ఉదయం 7 గంటలకు పనికి వెళుతున్నాను అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భర్త భోగది మహేష్ చుట్టుప్రక్కల, బంధువుల ఇళ్లలో వెతికిన తన భార్య కనిపించడం లేదని శనివారం పోలీస్ స్టేషన్ లో భర్త ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.






