- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంకేశ్వరం గ్రామ శివారులో గంజాయి సాగు వెలుగులోకి
by Ratna Kumari |
నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం వంకేశ్వరం గ్రామ శివారులో ఓ రైతు తన వ్యవసాయ పొలంలో గంజాయి సాగు వెలుగు చేస్తున్న విషయం తెలుగులోకి వచ్చింది.

X
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం వంకేశ్వరం గ్రామ శివారులో ఓ రైతు తన వ్యవసాయ పొలంలో గంజాయి సాగు వెలుగు చేస్తున్న విషయం తెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేయడంతో అక్రమ సాగు బహిర్గతం అయింది. ఈ విషయంపై ఎక్సైజ్ సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వంకేశ్వరం గ్రామంలో నేనావత్ సెల్లి, తిరుపతయ్య దంపతులు తమ వ్యవసాయ పొలంలో మొక్కజొన్న సాగు చేస్తున్నాడు అందులో అంతర్భాగమే గంజాయి మొక్కలను కూడా సాగు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆ వ్యవసాయ పొలంలో మొత్తం 16 గంజాయి మొక్కలు అలాగే అదనంగా 1.8 కిలోల ఎండు గంజాయి స్వాధీనం స్వాధీనం చేసుకుందామని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరచామన్నారు. అక్రమంగా గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Next Story






