- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడదెబ్బతో వ్యక్తి మృతి
వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, నారాయణపేట ప్రతినిధి : వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ధన్వాడ మండలానికి చెందిన నీరటి చంద్రయ్య (48) అప్పక్‌పల్లి గ్రామ శివారులో అపస్మారక స్థితిలో ఉండగా.. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో తీవ్ర ఎండల ప్రభావంతో వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి వివరాలను గుర్తించిన అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి తెలిపారు.






