గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

by Elthuri vijay kumar |

రోడ్డుపై మృతదేహాన్ని చూసి సడన్ బ్రేక్ వేయడంతో డీసీఎం బోల్తా.. ఊర్కొండ మండలంలో అర్ధరాత్రి ఘటన

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
X

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

-రోడ్డుపై మృతదేహాన్ని చూసి సడన్ బ్రేక్ వేయడంతో డీసీఎం బోల్తా

-ఊర్కొండ మండలంలో అర్ధరాత్రి ఘటన

దిశ, ఊర్కొండ : గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందగా కాసేపటికి అటుగా వచ్చిన డీసీఎం డ్రైవర్ శవాన్ని చూసి సడల్ బ్రేక్ వేయడంతో డీసీఎం బోల్తా పడ్డ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లి వద్ద 167వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రకారం మండల పరిధిలోని రాచర్ల పల్లి తండాకు చెందిన లంబాడి శ్రీను (46) తరచూ బస్సుల్లో తిరిగేవాడని, బుధవారం అర్ధరాత్రి ముచ్చర్లపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలో కాసేపటికి అటుగా జడ్చర్ల నుండి కల్వకుర్తి వైపు వెళ్తున్న డీసీఎం రావడంతో డీసీఎం డ్రైవర్ రోడ్డుపై మృతదేహాన్ని చూసి ఒక్కసారి బ్రేక్ వేయడంతో డీసీఎం వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆసుపత్రికి తరలించి రోడ్డుపై అడ్డంగా పడివున్న డీసీఎంను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story