ఈతకెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి వ్యక్తి మృతి..

by Taduka Kalyani |

చెరువులో ఈత కోసం వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరుగుపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది.

ఈతకెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి వ్యక్తి మృతి..
X

దిశ, జడ్చర్ల: చెరువులో ఈత కోసం వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరుగుపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూరుగుపల్లి గ్రామానికి చెందిన భగవంత్ (30), బూరుగుపల్లి గ్రామంలోని సూది కుంట చెరువులో ఆదివారం మధ్యాహ్నం గ్రామస్తులతో కలిసి స్నానం చేయడానికి వెళ్లాడు. ఈత కొడుతుండగా మధ్యలో భగవంత్ కు ఊపిరాడక చెరువులోని నీటిలో మునిగిపోయాడు.

ఇది గమనించిన తోటి గ్రామస్తులు భగవంత్ ని బయటికి తెచ్చే ప్రయత్నం చేయగా అప్పటికే నీటిలో మునిగి గల్లంతయ్యాడు. దీంతో గ్రామస్తులు చెరువులో వెతకగా అడుగు భాగంలో భగవంతుని మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story