- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో నిర్వాహణ లోపం.. వైద్యుల నిర్లక్ష్యం..!
దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా జనరల్ అసుపత్రిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ వ్యక్తి మృతి కి

దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా జనరల్ అసుపత్రిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ వ్యక్తి మృతి కి సంబంధించిన వ్యవహారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహబూబ్ నగర్ ఏనుగోండకు చెందిన ఓంకార్(30) అనే వ్యక్తి ఈ రోజు ఉదయం అనుమానాస్పద స్థితిలో అపస్మరక స్థితిలోకి వెళ్ళడంతో హూటాహూటిన పట్టణంలోని ఏస్వీఏస్ ఆసుపత్రికి తరలించారు. అయితే సదరు వ్యక్తి అప్పటికే మృతి చెందటంతో మృతదేహాన్ని ఏస్వీయస్ ఆసుపత్రి నుంచి మృతి నిర్ధారణ కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన వ్యవహారాన్ని మెడికో, లీగల్ కేసుగా పరగణించి వివరాలు నమోదు చేసి విచారణ చేపట్టాల్సిన అధికారులు అవేవి పట్టనట్లుగా బాడిని తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించేసి చేతులు దులుపుకున్నారు. ఓ వైపు బంధువులు బాత్ రూమ్ లో కాలు జారి పడ్డట్టుగా వివరాలు తెలియజేసిన డాక్టర్లు మాత్రం గుండె పోటుతో చనిపోయినట్లు గా నిర్ధరణకు వచ్చారు. ఏది ఏమైన ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్సీ నమోదు కాకుండా పోస్టుమార్టం ని కూడ బంధువులు, అధికారులు అడ్డుకోవడంపై తీవ్ర అనుమానాలు పుట్టుకోచ్చాయి. సోషల్ మీడియా లో ఆధికారుల నిర్లక్యం పై ఇష్యూ వైరల్ కావడంతో ఇంటికి తీసుకెళ్లిన ఓంకార్ మృత దేహాన్ని తిరిగి జనరల్ ఆసుపత్రికి రప్పించి పోస్టుమార్టం నిర్వహించారు. మెడికో లీగల్ కేసుల వ్యవహారంలో అటు మహబూబ్ నగర్ జనరల్ అసుపత్రి డాక్టర్లు, ఇటు ఏస్ఫియఫ్ (స్పేషల్ ప్రోటక్షన్ ఫోర్స్ అధికారులు) నిర్వహిస్తున్న తీరు త్రీవ అనుమానాలకు దారి తీస్తుంది.
గతంలో కూడ ఇవే తప్పిదాలు
గతంలో కూడ జిల్లా కేంద్రంలో పలు మృతి కేసులకు సంబంధించి ఎమ్మెల్సీ (మెడికల్ లీగల్ కేసు) నమోదు, పోస్టుమార్టం కానీ చేయకుండానే నేరుగా బంధువులకు మృతదేహాలను అప్పగించారు విషయం బయటకు పోక్కి అనుమానాలు రేకెత్తడం తో పలు పోలిస్ స్టేషన్ లోని సర్కిల్ ఇన్స్ పెక్టర్లు కుటుంబ సభ్యులను బ్రతిమిలాడి మరి మృత దేహాలను తీసుకు వచ్చి పోస్టు మార్టం నిర్వహించారు.స్పేషల్ ప్రోటక్షన్ ఫోర్స్ సిబ్బంది వ్యవహారంపై గతంలో ఉన్నత స్థాయి ఆధికారుల దాక ఫిర్యాదులు వెళ్ళడంతో ఉన్నత అధికారులు సైతం విచారణకు ఆదేశించి నేరుగా వచ్చి విచారణ చేపట్టారు.న్యాయ సేవ ఆధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా గారు జిల్లా ఆసుపత్రిని సందర్శించి విచారణ చేపట్టారు.ఈ విచారణ చేపట్టి 15 రోజులు కూడ గడవకముందే మరో మారు ఏస్ఫియఫ్ అధికారుల అలసత్వపు తీరు విమర్శలకు దారి తీస్తుంది. సుమారు 13 మంది స్పెషల్ ప్రోటక్షన్ ఫోర్స్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న జిల్లా జనరల్ ఆసుపత్రిలో అధికారుల తీరుపై కొత్త అనుమానాలు రావడం గమనార్హం.






